పెళ్లికి నిరాక‌రించింద‌ని-ఆత్య‌చార య‌త్నం

0
161

ఒంగోలుః ప్ర‌కాశం జిల్లా కనిగిరిలో దారుణం జరిగిన విషయం తెలిసిందే. స్నేహం పేరుతో ఓ యువతిపై అత్యాచారయత్నం చేయడమే కాకుండా, దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. వెంటనే స్పందించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.ఈ ఘటనలో ప్రధాన నిందితుడుగా కార్తిక్ అనే యువకుడిని గుర్తించారు. అతని స్నేహితులు పవన్ సాయి, కోటేశ్వరరావు కూడా అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. కనిగిరిలో డిగ్రీ చదివే ఓ విద్యార్థినికి కార్తిక్ అనే యువకుడితో స్నేహం ఉంది. దాన్ని అడ్డుపెట్టుకుని ఓ రోజు ఆమెను పంటపొలాల్లోకి తీసుకువెళ్లాడు.అక్కడకు స్నేహితులను కూడా పిలిపించాడు. అక్కడ కార్తిక్ యువతిపైకి ఉసిగొల్పాడు. సాయి అనే యువకుడు అమ్మాయిపై అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా కార్తిక్ అతని స్నేహితులు తమ సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. నన్ను మోసం చేస్తావా అంటూ యువకుడు అన్నట్లు వీడియోలో ఉంది. తనను ఏం చేయవద్దని యువతి ఏడ్చినా, వారు దారుణంగా ప్రవర్తించారు. అమె దుస్తులు లాగి కిరాతకంగా ప్రవర్తించారుఆమెకు తోడుగా వచ్చిన మరో విద్యార్థిని ఈ ఘటనను నిలువరించే ప్రయత్నం చేసినా వారు వెనక్కి తగ్గలేదు. అమ్మాయిపై పైశాచికంగా వ్యవహరించిన కీచకులు అంతటితో ఆగకుండా ఆ వీడియో దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దృశ్యాలు బాధితురాలి కుటుంబం దృష్టికి రావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

LEAVE A REPLY