పాకిస్తాన్‌లో అణ్వాయుధాలు త‌యారి-చైనా సహకారం..?

0
151

అమెరికా శాస్త్ర‌వేత్తల హెచ్చ‌రికా…
అమ‌రావ‌తిః పాకిస్తాన్ కూడా ఉత్తరకొరియా బాటలోనే ప్రయాణిస్తోంది.ఉత్తర కొరియా, పాకిస్తాన్ లకు మూడోకంటికి తెలియకుండా చైనా సహకారం అందిస్తిందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.ఆసియాలో మరోసారి పాకిస్తాన్ తయారుచేస్తున్న అణ్వాయుధాలు కేవలం భారత్‌ను బెదిరించడానికేనా లేక మ‌రోందుకు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పాక్ ఆక్రమిత్ కశ్మీర్ లో ఉగ్రవాదానికి పాకిస్తాన్ మరింత అజ్యం పోస్తోంది. ఒకేసారి తొమ్మిది కేంద్రాల్లో పాకిస్తాన్‌ అణ్వాయుధాల తయారీ చేస్తోందని అమెరికా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్థావరంగా మరింది. పాకిస్తాన్‌ 130-140 న్యూక్లియర్‌ వార్‌హెడ్లను రూపొందించే పనిలో పడింది.పాకిస్తాన్,దేశంలోని 9 ప్రాంతాల్లో అణ్వాయుధాలు తయారు చేస్తోందని ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో పంజాబ్‌ ప్రావిన్స్‌లో 4, సింధ్‌ ప్రావిన్స్‌లో 3, బలూచిస్తాన్‌లోని 2 కేంద్రాల్లో ఈ ఆయుధాలు రూపొందుతున్నాయని వారు పేర్కొన్నారు. పాకిస్తాన్ అణ్యాయుధ సంపత్తి పెంచుకోవడంలో చైనా పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరకొరియాకు సహకారం అందించనట్లుగానే చైనా లోలోపల పాకిస్తాన్ కు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.అమెరికా శాస్త్రవేత్తలు ఎం.కిర్‌స్టన్‌, రాబర్ట్‌ ఎస్‌.నోరిస్‌లు ఒక అంచనాకు వచ్చారు. సింధ్ లోని ఆక్రో గారిసన్ వద్ద అండర్‌గ్రౌండ్‌లో, పంజాబ్ లోని గుజ్రన్వాలా గారిసన్ ప్రాంతంలో,బలూచిస్తాన్‌ లోని ఖుజ్దార్‌ గారిసన్ ప్రాంతంలో భూగర్భంలో ఆయుధాలను నిల్వ చేసుకునే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తుంది.కరాచీలోని మస్రూర్ డిపార్ట్ మెంట్ లో శక్తివంతమైన బాంబులను,పంజాబ్‌ లోని నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ ఎస్‌ఎస్‌ఎమ లాంచర్‌ అసెంబ్లీ, వార్‌హెడ్ల తయారీ,సింధ్ లోని పానో అకిల్ గిరిసన్ వద్ద, పంజాబ్‌ లోని సర్గోదా డిపార్ట్‌మెంట్‌ వద్ద శక్తివంతమైన బాంబులను నిల్వ చేసుకోవచ్చని, ఇక్కడికి దగ్గరలోనే ఎఫ్‌-16 యుద్ధవిమానాలు కూడా అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. అలాగై ఖైబర్ లోని తర్బాలా అండర్‌గ్రౌండ్‌ డిపార్ట్‌మెంట్‌ లో శక్తివంతమైన వార్‌మెడ్లను నిల్వ చేస్తారట. ఇంకా పంజాబ్ లోని వాహ్‌ ఆర్డినెన్స్‌ ఫెసిలిటి వద్ద వార్‌హెడ్ల తయారీ, నిల్వకు అవకాశం ఉన్న‌ట్లు తెలిస్తుంద‌న్నారు.పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఆ దేశానికి సరైన పట్టులేదనే అనుమానాలు పొడచూపుతున్న నేపథ్యంలో ఈ అణ్వాయుధాలే గనుక ఉగ్రవాదుల చేతుల్లో పడితే ?

LEAVE A REPLY