నెల్లూరు నుండి ఎగిరిపోయిన ఎయిర్‌పోర్టు

0
2774

ద‌గ‌ద‌ర్త‌లో విమాన‌శ్ర‌యం ఏర్పాటు ర‌ద్దు-అజ‌య్‌జైన్‌
నెల్లూరుః నెల్లూరు జిల్లా ద‌గ‌ద‌ర్తిలో నిర్మించ‌నున్న విమాన‌శ్ర‌యం ప్ర‌తిపాద‌న‌లు ర‌ద్దు చేసి వేరే జిల్లాకు మార్చుట‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎన‌ర్జీ మ‌రియు మౌళిక స‌దుపాయాలు,పెట్టుబ‌డుల శాఖ ప్రిన్సిపాల్ సెక్ర‌ట‌రీ అజ‌య్‌జైన్ వెల్ల‌డించారు.గురువారం జిల్లా క‌లెక్ట‌ర్‌,జె.సి ఇత‌ర అధికారులతో క‌ల‌సి స్దానిక డిఆర్ ఉత్త‌మ్ హోట‌ల్లో ద‌గ‌ద‌ర్తి విమాన‌శ్ర‌యం గురించి చ‌ర్చించారు.ఈసంద‌ర్బంగా జైన్ మాట్లాడుతూ ద‌గ‌ద‌ర్తిలో విమానాశ్ర‌యం ఏర్పాటుల‌కు అన్నీ అనుమ‌తులు వ‌చ్చిన‌ప్ప‌టికి,కొన్ని కార‌ణాల‌వ‌ల‌న విమానాశ్రాయాన్ని ఇత‌ర జిల్లాకు త‌ర‌లించుట‌కు నిర్ణ‌యించిన‌ట్లు తెలియ‌చేశారు.విమానాశ్ర‌యం కోసం సేక‌రించిన ప్ర‌భుత్వ భూమితోపాటు అద‌నంఆ 168 ఏక‌రాలు ప్ర‌వేటు భూములను భూసేక‌ర‌ణ‌కు పోగా అక్క‌డ ఎక్కువ ధ‌ర డిమాండ్ చేస్తున్న‌ర‌ని,అది ప్ర‌భుత్వానికి సాధ్య‌ప‌డ‌ద‌ని అన్నారు.ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 20 కోట్ల పైన ప్ర‌జాధ‌నం ఈ ప్రాజెక్ట్ మీద ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింద‌ని,ఇక ఏవిధ‌మైన అవ‌కాశం లేనందున విమానాశ్ర‌యం ఏర్పాటును ర‌ద్దు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.అవ‌కాశాలు క‌ల‌సివ‌స్తే దానిపై పున‌ర‌లోచిండం జ‌రుగుతుంద‌ని,ఇప్ప‌టి పరిస్థితితుల్లో వీలు కాద‌న్నారు.ఈకార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ఆర్‌.ముత్యాల‌రాజు,జెసి.ఇంతియాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY