నెల్లూరును స్మార్ట్‌సిటిగా తీర్చ‌దిద్ద‌డానికి అంద‌రి స‌ల‌హాలు తీసుకొండి-క‌లెక్ట‌ర్‌

0
394

నెల్లూరుః న‌గ‌రాన్ని స్మార్ట్‌సిటిగా అభివృద్ది చేసేందుకు నెల్లూరు స్మార్ట్‌సిటి కార్పొరేష‌న్ లిమిటెడ్ మొద‌టి స‌మావేశం జిల్లా క‌లెక్ర‌ట్ అధ్య‌క్షత‌న క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో గురువారం జ‌రిగింది.ఈసంద‌ర్బంగా బోర్డు స‌భ్యుల‌ను ఉద్దేశించి అయ‌న మాట్లాడుతూ నెల్లూరు న‌గ‌రాన్ని స్మార్ట్‌సిటిగా తీర్చిదిద్ద‌డానికి న‌గ‌ర పౌరుల‌తో,వాక‌ర్స్ అసోసియేష‌న్స్‌,స్వ‌చ్చంద సేవా సంస్ద‌ల ప్ర‌తినిధుల‌తో స‌మావేశాలు ఏర్పాట‌చేసి వారి వ‌ద్ద నుండి స‌ల‌హాలు తీసుకోవాల‌ని కోరారు.స‌మావేశంలో నెల్లూరు స్మార్ట్‌సిటి కార్పొరేష‌న్ లిమిటెడ్ విదివిధానాలు,నిర్వ‌హించ‌వ‌ల‌సిని రిజిష్ట‌ర్లు,అడిట్ నిర్వ‌హ‌ణ గురించి చ‌ర్చించింది.స్మార్ట్‌సిటిగా నెల్లూరును అబివృద్ది చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం 33 కోట్లు విడుద‌ల చేయ‌నున్న‌ద‌ని,దానికి అనుగుణంగా ప్ర‌ణాళిక త‌యారుచేయాల‌ని కోరారు.అదేవిధంగా నెల్లూరు సిటి డెవ‌ల‌ప్‌మెంట్ కొర‌కు ప్ర‌త్యేకంగా ఒక బ్యాంకు అకౌంట్‌ను తెర‌వాల‌ని,ఆ అకౌంటులోకి ఎవ‌రైన దాత‌లు నెల్లూరు అభివృద్దికి త‌మ వంతు స‌హాయాన్ని స‌ద‌రు బ్యాంకు అకౌంటు ద్వారా అందించేలా చ‌ర్య‌లు తీస‌స‌కోవాల‌న్నారు.అదే విధంగా నెల్లూరు న‌గ‌ర కార్పొరేష‌న్ కార్యాల‌యంలో స్మార్ట్‌సిటి సెల్‌ను ఏర్పాటు చేయాల‌ని కోరాఉ. ఈసంద‌ర్బంలో క‌మీష‌న‌ర్ ఢిల్లీరావు మాట్లాడుతూ నెల్లూరు స్మార్ట్‌సిటి కార్పొరేష‌న్ లిమిటెడ్‌కు జిల్లా క‌లెక్ట‌ర్ అధ్య‌క్షులుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని,బోర్డు డైర‌క్ట‌ర్లు న‌గ‌ర మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ మ‌రియు జిల్లా ఎస్పీతోపాటు మరి ముగ్గురు స‌భ్యుల‌ను ప్ర‌భుత్వం నియ‌మిస్తుంద‌న్నారు

LEAVE A REPLY