నిఘా నీడ‌న గోదావ‌రి జిల్లాలు-ముద్ర‌గ‌డ్డ పాద‌యాత్ర అగేనా ?

0
99

అమ‌రావ‌తిః మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్ర నేపథ్యంలో పోలీసు శాఖ ముందుగానే అప్రమత్తమయ్యింది. పో లీసులు ఎంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి అనుకుంటే,కాపులు అంత స్పీడ్‌గా తిర‌గ‌బ‌డ‌త‌ర‌న్న‌ది చ‌రిత్ర చెపుతున్న‌స‌త్యం.ముద్ర‌గడ్డం పాద‌యాత్ర చేసినంత మాత్ర‌నా రాత్రికి రాత్రే కాపుల్లో పెద్ద మార్పు రాదు,అయితే ప్ర‌భుత్వం కాపుల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న ధోర‌ణ భ‌విష్య‌త్ మంచిదికాదు.ఇప్ప‌టికే జిల్లాలో కొన్ని రహదారులను పోలీసులు స్వాధీనంలోకి తీసుకుని పోలీసు పికెట్లు నిర్వహిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో కాపు సామాజికవర్గం నేతలతో పోలీసులు సమావేశాలు నిర్వహించి పాదయాత్రకు అనుమతిలేదని పాల్గొనేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో సెక్షన్ 30 144 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. దీంతో తూర్పు గోదావరి జిల్లాపై నిఘా నీడ ఆవరించింది.
కాపు సామాజిక వర్గం అధికంగావున్న ప్రాంతాల్లోనే కాకుండా జిల్లా అంతటా పోలీసులు అప్రమత్త చర్యలు చేపట్టారు. సభలు సమావేశాలు రాస్తారోకోలు ధర్నాలు పాదయాత్రలు గుమికూడటం వంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామాల్లో పోలీసులు మైకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన ప్రత్యేక పోలీసు బలగాలను సైతం జిల్లాలో మోహరింపజేసేందుకు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా ఇటు రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు జిల్లా పరిధిలోనూ అటు జిల్లా పోలీసు విభాగంలో ఉన్నతాధికారులు శాఖాపరంగా సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. గత సోమవారం జిల్లాలో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన వాయిదా పడటం గమనార్హం. ఆ సందర్భంలో సమావేశమైన పోలీసు ఉన్నతాధికారులు పనిలో పనిగా ఈ అంశాలపై సమీక్షించుకున్నట్టు తెలిసింది. బుధవారం జిల్లాలో పర్యటించిన డిజిపి నండూరి సాంబశివరావు సైతం జిల్లా అధికార్లతో ఈ విషయంపై చర్చించినట్టు తెలిసింది. అనుమతి లేని పాదయాత్రలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీచేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళనకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన రీతిలో పోలీసులు అన్ని వైపుల నుంచి వ్యూహాత్మకంగా చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY