నాయుడుపేట క‌మీష‌న‌ర్‌ ఇంటిపై ఏసిబి దాడులు

0
134

నెల్లూరుః ఆదాయనికి మించి ఆస్తులు వున్న‌య‌న్న స‌మాచారంతో నాయుడుపేట న‌గ‌ర‌పంచాయితీ క‌మీష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న‌ అవినేని.ప్ర‌సాద్ తిరుప‌తిలోని ఇంటిలొ,నాయుడుపేట‌లోని కార్యాల‌యంలో ఏసిబి అధికారులు మంగ‌ళ‌వారం ఉద‌యం 6.30 గంట‌ల నుండి త‌నిఖీలు నిర్వ‌హించి,రికార్డుల‌ను క్షుణంగా ప‌రిశీలిస్తున్నారు.ప్ర‌సాద్ ఇటివ‌ల తిరుప‌తి మ‌ల్టీ స్టోర్స్ బిల్డింగ్ నిర్మిస్తుండ‌డంతో,దానికి సంబంధించి ఆర్దిక లావాదేవిల‌పై ప్ర‌శ్నిస్తున్నారు.నెల్లూరులో వుంటున్న అతని కుమార్తె,శ్రీకాళ‌హ‌స్తిలో వుంటున్నఅత‌ని త‌ల్లి నివాసం,రాజంపేట‌లోని ప్ర‌సాద్ ఇద్ద‌రు స్నేహితుల ఇళ్లతో పాటు మొత్తం 6 చోట్ల‌ అధికారులు త‌నిఖీలు చేస్తున్నారు.ఆదాయానికి మించి దాదాపు 10 కోట్ల రూపాయ‌ల అస్తులు వున్న‌ట్లు స‌మాచారం. తిమ్మినాయుడుపాళెం,తుమ్మ‌ల‌గుంట‌,అక్కారంప‌ల్లి,ఎన్‌.జి.కాల‌నీ,తిరుప‌తిలో గాజుల మ‌న్యంలో ఇంటి స్ద‌లాలు గుర్తించారు.నాయుడుపేట పారిశుధ్యం ప‌నులు నిర్వ‌హించే,కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసిబి అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిస్తుంది.

LEAVE A REPLY