నాయి బ్ర‌హ్మ‌ణుల‌ను ఓట్ల బ్యాంకుల వాడుకుంటున్నారు

0
219

నెల్లూరుః నాయి బ్ర‌హ్మ‌ణ కార్పొరేష‌న్‌కు 105 కోట్ల రూపాయులు కేటాయించిన‌ట్లు చెపుతున్న ప్ర‌భుత్వం,ఎంత మంది నాయిబ్ర‌హ్మ‌ణుల‌కు బుణాలు మంజూరు చేసింద‌నే దానిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని నాయిబ్రహ్మ‌ణుల తెలుగురాష్ట్రల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కిన్నెర.మాల‌కొండ‌య్య డిమాండ్ చేశారు.సోమ‌వారం స్దానిక ప్రెస్‌క్ల‌బ్ నిర్వ‌హించి మీడియా స‌మావేశంలో అయ‌న మాట్లాడుతూ రాజ‌కీయ పార్టీలు అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కు నాయిబ్ర‌హ్మ‌ణ‌ల‌ను ఓట్ల బ్యాంకుల వాడుకుంటున్న‌ర‌ని విమ‌ర్శించారు.రాష్ట్రంలో ఉన్న నాయిబ్ర‌హ్మ‌ణ‌లు అంత ఒక‌టి అయితేనే,రాజ్య‌ధికారం రాద‌ని,అప్ప‌టి వ‌ర‌కు నాయిబ్ర‌హ్మ‌ణ‌లు పేద‌రికంలోనే మ‌గ్గి పోవాల్సిదేనని అవేద‌న వ్య‌క్తం చేశారు.ఈకార్య‌క్ర‌మంలో నాయిబ్ర‌హ్మ‌ణుల ఉద్యోగ సంఘ నాయ‌కుడు సుబ్బ‌య్య ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు.

LEAVE A REPLY