నంద్యాల ఉపఎన్నికల్లో చంద్ర‌బాబు మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు-వైఎస్ జ‌గ‌న్‌

0
226

క‌ర్నూల్ః మనం వేసే ఓటు ఎవరినో ఎమ్మెల్యేనే చేసేందుకు మాత్రమే కాదు,చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనపై వేయబోతున్న ఓటు అని వైఎస్ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు.బుధ‌వారం నంద్యాల్లోని చింత అరుగులో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూమీరు వేసే ఓటు ధర్మానికి, అధర్మానికి వేసే ఓటు,విశ్వసనీయతకు అర్థం తీసుకొచ్చేలా ఓటు వేయాలని కోరారు.మూడున్నరేళ్లలో చంద్రబాబును,మంత్రులను,నంద్యాల రోడ్ల మీద ఎప్పుడైనా చూశారా,మూడేళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టించారా అని ప్ర‌శ్నించారు. వైఎస్‌ఆర్ పాలనలో నంద్యాలలో 21,800 పెన్షన్లు ఉంటే,చంద్రబాబు పాలనలో 15 వేలకు కుదించార‌ని,రేష‌న్ దుకాణంలో బియ్యం తప్ప ఇంకా ఏం రావటం లేదన్నారు.నంద్యాలలో కాలనీల అభివృద్ధికి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.బాబు వస్తే జాబు వస్తుందని,జాబు రాకపోతే ప్రతి నిరుద్యోగికి రూ.2 వేల చొప్పున భృతి ఇస్తామన్నారు.ఈ 38 నెలల్లో ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.78 వేలు బకాయి పడ్డారనిన ఆరోపించారు.
ముఖ్యమంతి కావడానికి చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పారో చూశామ‌ని,ఎన్నికల తర్వాత కర్నూలు సాక్షిగా స్వాతంత్ర్య వేడుకల్లో,ఇచ్చిన హామీల్లోనూ ఒక్కటీ అమలు చేయలేదని గుర్తు చేశారు.కర్నూలుకు ఎయిర్‌పోర్టు,ట్రిపుల్ ఐటీ,స్మార్ట్ సిటీ,ఉర్దూ వర్సిటీ, మైనింగ్ స్కూల్, అవుకు వద్ద ఇండస్ట్రియల్ పార్క్‌,ఆదోని, ఎమ్మిగనూరులో అపెరల్ పార్క్‌లు,కర్నూలులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పిన హామీలు ఏమైనాయ‌ని ప్ర‌శ్నించారు. సీఎం హోదాలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదని,నంద్యాల ఉపఎన్నిక వచ్చేసరికి మరోసారి మోసం చేయాలని చూస్తున్నర‌న్నారు. చంద్రబాబు తన దగ్గర ఉన్న పోలీస్ బలంతో ఓటు అడుగుతున్నారని,డబ్బులు లేవు,పోలీసులు లేరు,నా దగ్గర ముఖ్యమంత్రి పదవి లేదని,ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపే చానళ్లు, పేపర్లు లేవన్నారు.దేవుడి దయ, మీ ఆశీస్సులు నాకు కావాలని, ధర్మాన్ని బతికించండి, వైఎస్‌ఆర్ సీపీని గెలిపించండని కోరారు.

LEAVE A REPLY