టిడిపి నేత వాసిరెడ్డి వ‌ర‌ద‌రావు జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్ఆర్‌సిపి చేరిక‌

0
560

వైసిపిలోకి వ‌ల‌స‌లు….
శ్రీకాకుళం: తెలుగ‌దేశం పార్టీ అధినేత‌ నారా చంద్రబాబు నాయుడుకు వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం షాకిచ్చారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో పలువురు వైసిపి, కాంగ్రెస్ నేతలను టిడిపి ఆకర్షిస్తోంది. అయితే, జగన్ టిడిపి అసంతృప్త నేతలపై దృష్టి సారించారు.ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు నేతలు వైసిపిలో చేరారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైయస్‌ జగన్‌ సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు పార్టీలో చేరారు. బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా పలు మార్లు గెలిచి ఆ తరువాత ఎమ్మెల్సీగానూ పనిచేసిన సీనియర్ లీడర్ వాసిరెడ్డి వరద రామారావును, వైయస్‌ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ సొంత పార్టీ టీడీపీపై నిప్పులు చెరిగి ఆ పార్టీ నుంచి నిష్క్రమించారు. వరద రామారావు పాటు మరి కొంత మంది స్థానిక నేతలు కూడా కూడా వైసిపి తీర్థం పుచ్చుకున్నారు.కాగా, వంశధార ప్రాజెక్టు వల్ల నిర్వాసితులుగా మారిన 13 గ్రామాలకు చెందిన బాధితులకు అండగా నిలిచేందుకు శ్రీకాకుళం పర్యటనకు జగన్ వచ్చారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి బాధితులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఈ సాయంత్రం హీరమండలంలో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.వైయస్ జగన్ వెంట పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్రస్వామి, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్ తదితరులు ఉన్నారు.రెండో రోజు ప‌ర్యాట‌న భాగంగా జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శనివారం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి గ్రామంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులను కలుసుకుంటారు

LEAVE A REPLY