టిడిపిలో నాకు తీవ్రంగా అవమానం జరిగింది-అన్నా.రాంబాబు

0
199

ప్ర‌కాశంః ఒంగోలు జిల్లాలో తెలుగుదేశంపార్టీకి ఎదురుదెబ్బలు త‌గ‌ల‌డం ప్రారంభం అయిన‌ట్లు క‌న్పిస్తుంది.ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, టిడిపికి రాజీనామా చేసిన ఘటన మరవక ముందే మ‌రో షాక్ త‌గిలింది.గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీకి రాజీనామా చేశారు.టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డికి చంద్ర‌బాబు ప్రాధాన్యమిచ్చారు.దీంతో టీడీపీపై కొంత‌కాలంగా రాంబాబు అలిగారు. చంద్ర‌బాబు త‌న‌కు అన్యాయం చేశారని రాంబాబు గత కొంతకాలంగా అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపధ్యంలో రాంబాబు గిద్దలూరులో అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. కార్యకర్తల సమావేశంలోనే ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించి తన మెడలో నుంచి టిడిపి పార్టీ కండువాను తీసి పక్కన పడేశారు.
టిడిపిలో తనకు తీవ్రంగా అవమానం జరిగిందని, ఇక ఆ పార్టీలో కొనసాగడం సిగ్గుచేటన్నారు. అందుకే టిడిపికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.మరొవైపు తాను ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరడం లేదన్నారు.త్వరలోనే తన అభిమానులు,అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.దీంతో ప్రకాశంజిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొన్న ఆధిపత్య పోరులో తొలి వికెట్ పడినట్టయింది.అన్నా రాంబాబు బాటలోనే మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేతలు పయనించనున్నారన్న సమాచారం టిడిపి నేతల్లో కలవరాన్ని కలిగిస్తోంది.

LEAVE A REPLY