జిల్లా టిడిపి నాయ‌కుల్లో రాజ‌కుంటున్న అసంతృప్తి

0
268

నెల్లూరుః జిల్లాలో తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి రెండో సారి బ‌య‌ట ప‌డిన‌ట్లు క‌న్పిస్తుంది.గతంలో వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రిగా సొమిరెడ్డి ప్రమాణ‌స్వీక‌రం చేసిన రోజు జిల్లాకు చెందిన నాయ‌కులు త‌మ అసంతృప్తిని గైరుహ‌జ‌రై వెళ్ల‌బుచ్చారు.ఇదే నేప‌థ్యం బాలకృష్ణ సమక్షంలో శనివారం నాడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నుడా(నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఛైర్మన్ గా నియమితులైన సంద‌ర్భంలో స్ప‌ష్టంగా క‌న్పించింది.
జిల్లా నుంచి నుడా ఛైర్మన్ పదవి కోసం చాలామందే పోటీపడినప్పటికీ,మాజీ మంత్రి తాళ్ల‌పాక‌.రమేష్‌రెడ్డి స‌తీమ‌ణి అనూరాధ 2014లో టిడిపి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి పార్టీ కార్య‌క్రమాల్లో చురుగ్గ పాల్గొటుంన్నారు.ఒక సారి నెల్లూరు మునిసిపాల్ ఛైర్మ‌న్‌గా ప‌నిచేసిన అనుభ‌వం,అంద‌రిని క‌లుపుకుని పోయే మ‌న‌స్త‌త్వం,మ‌హిళ‌నేత కావ‌డం అమెకు నూడా ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని అంద‌రు బావించారు.అయితే బాలయ్య సిఫారసుతో కోటంరెడ్డి ప‌దవీ ఖరారైపోయింది.నుడా ఛైర్మన్ గా కోటంరెడ్డి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి.. బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అభిమానులు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దివంగత ఎన్టీఆరో్ నుంచి నందమూరి కుటుంబానికి ఫ్యాన్స్ అసోసియేషన్లను నిర్వహిస్తున్న నేతలు ఈ కార్యక్రమానికి రాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, ఆయన భార్య అనురాధ, వారి వర్గం మొత్తం దీనికి దూరంగా ఉన్నారు. వీరితో పాటు బాలయ్య అభిమాన సంఘ అధ్యక్షుడు కిన్నెర బ్రదర్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో బాలయ్య అభిమానులు ఆయనపై గుర్రుగా ఉన్నారా? వారి నిర‌స‌న‌ను ఈ విధంగా తెలియ‌చేసిన‌ట్లు ప‌ట్ట‌ణంలో చ‌ర్చ జ‌రుగుతుంది.ఇదే స‌మయంలో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బొల్లినేని రామారావు, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు పార్టీ నేతలు ఆనం బ్రదర్స్, నగర టీడీపీ కార్పోరేటర్లు కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.దింతో రాబోయే రోజుల్లో ఏలాంటి అంత‌ర్గ‌త ప‌రిణ‌మాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే ?

LEAVE A REPLY