జిల్లాలో డెంగ్యూ జ్వరాల వ‌ల్ల .మరణాలు లేవు-మంత్రి కామినేని

0
189

ప్రకాశంః గ్రామాలలో పారిశుధ్య లోపం,త్రాగునీరు కలుషితం అవ్వడం వల్ల జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని,జిల్లాలో డెంగ్యూ జ్వరాలు ఉన్నప్పటికీ..మరణాలు లేవని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగ‌ళ‌వారం జిల్లాలో ప్రబలుతున్న డెంగ్యూ జ్వరాలపై కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వినయ్ చంద్‌తో క‌ల‌సి సమీక్షి నిర్వ‌హించారు.ఈంస‌ద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ గుండె జబ్బులు,ఇత‌ర‌ అనేక కారణలతో కొంత మంది మరణించారన్నారు.జ్వరాలు ప్రబలిన గ్రామాలలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రక్త నమూనాల సేకరణతో పాటు మందులు ఇస్తున్నమ‌ని,డాక్టర్ల పరీశీలనలో డెంగ్యూ జ్వరాలను గుర్తించినట్లయితే వారికి మెరుగైన వైద్యం కోసం రిమ్స్ కు రిఫర్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.అన్ని సామాజిక ఆసుపత్రులలో జ్వరభాదితులకు ప్రత్యేకంగా 3 పడకలు ఏర్పాటు చేస్తున్నమ‌ని,ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా డెంగ్యూ వార్డుతో పాటు వెంటిలేటెర్స్ ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు.చంద్రన్న సంచార వైద్యసేవల వాహనాలు గ్రామాలలోకి వెళ్లినప్పుడు డెంగ్యూ జ్వరాలు ఉన్నట్లు వారు గుర్తించినట్లయితే సమాచారన్ని వైద్య,ఆరోగ్యశాఖ ఆధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.
ప్రకాశం జిల్లాలోని శ్రీశైలం ఐటిడిఏ పరిధిలో ఉన్న చెంచుగూడెం లలో 81 మంది మెడికల్ ఆఫిసర్స్ ను నియమించి వారంలో రెండు రోజులు (గురు,శుక్ర ) ఆ గ్రామాలలో పర్యాటించాలన్నారు.గిరిజనులకు వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్తలతో పాటు మందులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఎఎన్ఎమ్‍, ఆశా కార్యకర్తలు గ్రామాలలోని ప్రజలను వ్యాధులు రాకుండా చైతన్య పరచాలన్నారు.కేంద్రప్రభుత్వం “స్వచ్చతా హి సేవ” పేరిట సెప్టెంబర్ 15 నుండి అక్టొబర్ 2 వరకు అన్ని గ్రామాలలో, ఆసుపత్రులలో పరిసరాలు -పరిశుభ్రత కార్యక్రమంను నిర్వహించేల ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు.రిమ్స్ లో త్రాగునీటి సమస్యను త్వరగా పరిష్కరించాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు.ఈ స‌మీక్షా స‌మావేశంలో జిల్లా వైద్యాధికారు,ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY