చంద్ర‌బాబు లాగ జ‌గ‌న్ దిగ‌జారుడు రాజ‌కీయాలు చేయాడు-వైఎస్ఆర్‌సిపి

0
212

గ‌డువు ముగియ‌నుండ‌డంతో పెరిగిన విమ‌ర్శ‌ల తీవ్ర‌త‌..
క‌ర్నూలుః చంద్రబాబు, టీడీపీ రోగిష్టి పార్టీ,చంద్రబాబు కండీషన్ కంటే భిన్నంగా పార్టీ పరిస్థితేం లేదని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని,’చంద్రబాబు మాట్లాడితే జనం నవ్వుతారు’ ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టించారని వైఎస్సార్‌ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కాపుల గొంతు కోసింది చంద్రబాబే,ఆ విషయాన్ని మేం కాదు,టీడీపీ ఎమ్మెల్యే బోండానే చెప్పారని వైఎస్ఆర్సీపీ నేత జోగిరమేష్‌, హత్యల గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమ‌ని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఆదివారం నంద్యాల్లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో తీవ్రంగా విమ‌ర్మించారు. దొంగతనంగా మామకు వెన్నుపోటు పొడిచి,పార్టీని ఆక్రమించుకున్న వ్యక్తి చంద్రబాబు అని,ప్రజలను నమ్ముకుని పార్టీ పెట్టి పదవులను వదులుకున్న వ్యక్తి జగన్‌మోహ‌న్‌రెడ్డి అని ఎమ్మేల్యే కోడాలి.నాని అన్నారు.నీలాగ సీఎం కావాలనుకుంటే జగన్ ఎప్పుడో అయ్యేవాడు,కానీ కుట్రలు, కుతంత్రాలు తెలియవు కాబట్టే పార్టీ పెట్టి పోరాడుతున్నారని,పదవులకోసం ఏ గడ్డైనా తినేది చంద్రబాబు,ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు 10 మంది మంత్రులు..50 మంది ఎమ్మెల్యేలు, నువ్వు, నీ కొడుకు, నీ బామ్మర్దా..ధనం, కండ కావరం, అధికారం, రిగ్గింగ్‌తో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు ఆరోపించారు.
మేక‌పాటి.రాజ‌మోహ‌న్‌రెడ్డిః చంద్రబాబు లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉన్నాళ్లు ప్రజాస్వామ్య మనుగడ కష్టాల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిరాయింపుదారులకు పదవులు ఇచ్చి ప్రజాస్వామ్య విలువలను కాలరాశారని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని ఆరోపించారు.
జోగి.రమేష్ః నిర‌హారదీక్ష చేస్తున్న వంగవీటి రంగాను,కత్తులు, గొడ్డళ్లతో చంద్రబాబు నరికి చంపించారి అయ‌న ఆరోపించారు. ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని,ఇప్పుడేమో మంజునాథ నివేదిక రావాలంటున్నరిని,ముద్రగడ ఇంటిని జైలుగా మార్చి వేధిస్తున్నారని,అలాంటి పార్టీకి బలిజలు ఓటు వేస్తారా అని ప్ర‌శ్నించారు
ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్రెడ్డిః 480 మందిని మర్డర్లు చేయించిన ఘనత చంద్రబాబుదని,ఐఏఎస్ రాఘవేంద్రరావు, కాపు నేత వంగవీటి రంగా..జర్నలిస్టు పింగళి దశరథ్ను చంపించింది చంద్రబాబే తీవ్ర విమ‌ర్శలు చేశారు.తాను మర్డర్లు చేయించి ఇతరులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.కొడుకును మంత్రిని చేసి భూమా కుటుంబాన్ని రోడ్డున పడేశారని,ఇప్పుడేమో నంద్యాలకు వచ్చి చంద్రబాబు నీతులు వల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు.చంద్రబాబుకు మోసాలు, అక్రమాలు, అబద్ధాలు గురించి నంద్యాల ప్రజలకు బాగా తెలుసున‌ని,ఉపఎన్నిక ద్వారా కచ్చితంగా చంద్రబాబుకు గుణపాఠం చెబుతారన్నారు.

LEAVE A REPLY