క‌ర్నూలు జిల్లా వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం-ఒక‌రు మృతి,మ‌రో 4 ప‌రిస్దితి విష‌మం

0
228

క‌ర్నూలుః సోమ‌వారం వేకువ‌జామున కర్నూలు జిల్లా డోన్ దగ్గర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెంద‌గా,మ‌రో నలుగురి ప‌రిస్దితి విష‌మంగా వుంది.పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం కర్ణాటకకు చెందిన వోల్వో బస్సు .మైసూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా, ముందు వెళ్లుతున్న మ‌రో బస్సును ఓవర్ టేక్ చేయబోయి, ఖాళీ గ్యాస్ సిలిండ‌ర్ల లోడ్‌తో వెళ్లుతున్న‌లారీ ని ఢీ కొట్టింది.దింతో బ‌స్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది.బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న మ‌హిళ అక్క‌డిక్క‌డే మృది చెందింద‌ని పోలీసులు తెలిపారు.ఘ‌ట‌న స్ద‌లంకు జెసిబిని ర‌ప్పించి,ముందు బాగంలో ఇర్కుకుని వున్న వారి ర‌క్షించారు.గాయాప‌డిన వారి చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించి,కేసు న‌మోదు చేసుకుని ద‌ర్య‌ప్తు చేస్తున్న‌మ‌ని,బ‌స్సులో ప్ర‌యాణించే వారి వివ‌రాలు తెలియ‌రావ‌ల్సివుంద‌న్నారు.లారీలో వున్న‌వి ఖాళీ సిలిండర్లు కావ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌న్నారు.

LEAVE A REPLY