కాపుల‌ రిజ‌ర్వేష‌న్లు విష‌యంలో చంద్రబాబు తాత్సారం చేస్తున్నారు. ముద్రగడ,,,సినిన‌టి హేమ‌

0
477

ఏలూరు: ఎన్నికల స‌మ‌యంలో కాపుల ఓట్ల కోసం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అధికారంలోకి రాగ‌నే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామని హామీ ఇచ్చి .ఇప్ప‌డు రిజర్వేషన్ల విషయంలో క‌మిష‌న్ పేరుతో కావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్సారం చేస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. .తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన కాపు ఐకాస సమావేశాన్ని నిర్వహించారు.రిజర్వేషన్లు కాపు సామాజిక వర్గం హక్కు అని సినీ నటి హేమ అన్నారు. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.రిజర్వేషన్లు కాపుల హక్కులు అని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీనే తాము నెరవేర్చమని అడుగుతున్నామన్నారు. కాపు ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలన్నారు. దానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.కాగా, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాపు రిజర్వేషన్‌ బిల్లు పెట్టాలని, లేకుంటే చలో అమరావతి నిర్వహిస్తామని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం హెచ్చరించారు.కాపు రిజర్వేషన్లు ఇవ్వలేదని నిరుత్సాహం చెందడం లేదని, ఇచ్చే వరకూ నిద్రపోకుండా పోరాడతామన్నారు. వైసిపి నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ… ముద్రగడ చేపట్టే ఏ ఉద్యమానికైనా తమ మద్దతు ఉంటుందన్నారు.

LEAVE A REPLY