కాకినాడు బీచ్ వ‌ద్ద ఘోర ప్ర‌మాదం-5గురు విద్యార్దులు మృతి

తూర్పుగోదావరిః వేస‌వి కాలం ప్రారంభం కావ‌డంతో విద్యార్దులు ఆట‌విడుపుగా స్నానాల‌కు వెళ్లి ప్రాణ‌లు వ‌దులుదున్నారు.గురువారం కాకినాడ ఎన్టీఆర్‌ బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన 8మందిలో ఐదుగురు గల్లంతయ్యారు. వారిలో శ్రీను, అనిత, దేవి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటనపై ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టాలని ఆదేశించారు. బాధితులు తూర్పుగోదావరి జిల్లా యానాం కాపులపాలెంనకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

LEAVE A REPLY