ఏసిబి వ‌లలో అవినితి బంగారు తిమిగ‌ళం-ధ‌ర 500 కోట్లు

0
278

విజ‌య‌వాడః ఆక్ర‌మంగా సంపాదించిన డ‌బ్బు,వెండి,బంగారం ఎక్క‌డ దాచ‌లో ఆర్దంకాక,వాషీంగ్ మెష‌న్‌లో దాదాపు వెండి,బంగారం క‌లిపి 15 కేజిలుగా వున్న‌ట్లు బ‌య‌ట‌ప‌డ్డాయి.సోమ‌వారం అవినీతి నిరోధక శాఖ అధికారుల వ‌ల‌కు భారీ అవినీతి బంగారు తిమింగలం చిక్కింది. ఏపీ రాష్ట్ర పట్టణ ప్రణాళిక శాఖ డైరెక్ట‌ర్‌ గొల్ల వెంకట రఘు నివాసంలో అనిశా అధికారులు సోదాలు చేపట్టారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.500 కోట్లపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రఘు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా మంగళగిరిలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. రఘు నివాసం వుంటున్న మంగ‌ళ‌గిరితో పాటు విజయవాడ, చిత్తూరు, నెల్లూరు, షిర్డీ, విశాఖ ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖ అనిశా డీఎస్పీ కేవీఆర్‌కే ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. గన్నవరం వద్ద 300 ఎకరాల భూమి, తాడేపల్లిలో నివాస స్థలాలు,గ‌న్న‌వ‌రంలో వెయ్యి చద‌ర‌పు గ‌జాల ఇంటి స్ద‌లం,మంగ‌ళ‌గిరిలోని కొంప‌నేని లేఅవుట్‌లో,చిత్తూరు,విశాఖ‌లోమ‌రో ఇంటి స్ద‌లం, ఉన్నట్లు గుర్తించారు.ఈ దాడుల‌ను ఏసిబి డిజిపి ఠాకూర్ ప‌రివేక్ష్యిస్తున్నారు.ఇంకా సోదాలు జ‌రుగుతునే వున్నాయి.ఏసిబి డిస్పీ ర‌మాదేవి ఆధ్వ‌ర్యంలో ర‌ఘుకు బినామీగా బావిస్తున్నన‌ల్లూరు.శివ‌ప్ర‌సాద్, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్ద‌లో జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ ప‌నిచేస్తున్న‌డు ఇత‌ని ఇంటిలో సోదాలు నిర్వ‌హించ‌గా,అత‌ని ఇంట్లో బంగారం,వెండి,వ‌జ్రాలు కుప్పులు,తెప్ప‌లుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి . వీటి విలువ దాదాపు 15 కోట్ల రూపాయ‌లుగా లెక్క క‌ట్టిన‌ట్లు తెలుస్తుంది.15 రోట్ల ఏసిబి బృందాలు సోదాలు నిర్వ‌హిస్తున్నాట్లు తెలిసింది.ఏసిబి దాడుల‌ను ఏసిబి డిజిపి ఠాకూర్ ప‌రివేక్ష్యిస్తున్నాడు.

LEAVE A REPLY