ఏరువాకకు వ‌చ్చిన ఎద్దు-రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణం-క‌న్నీటి ప‌ర్యాంతం అవుతున్న రైతు

0
286

అనంత‌పురంః ఏరువాక కార్య‌క్ర‌మంకు ఎద్దుల బండితో వ‌చ్చిన రైతు తిరిగి ఉరికి వెళ్లుతుండ‌గా రోడ్డు ప్ర‌మాదంలో ఎద్దు అక్క‌డిక్క‌డే చ‌నిపోయింది.వివ‌రాల్లోకి వెళ్లితే,, అనంతపురం జిల్లాలో శుక్రవారం చంద్రబాబునాయుడు ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ఎద్దులను తెచ్చి ఆట్ట‌హ‌సంగా కార్యక్రమం నిర్వ‌హించారు.ఏరువాక ముగిసిన తర్వాత ఎద్దుతో రైతులు తిరిగి గ్రామ‌ల‌కు వెళ్లుతున్నారు. క్ ఉడేగోళం గ్రామానికి చెందిన రైతు విజయ్‌ ఎద్దుల బండిని కట్టుకుని ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఎడ్లబండిని ఢీకొట్టింది. దీంతో ఏరువాకకు వచ్చిన ఎద్దు అక్కడికక్కడే చనిపోయింది. ఏరువాకకు వచ్చి ప్రమాదానికి గురైనందున ఆర్థిక సాయం చేయాలని గ్రామ సర్పంచ్ గురుశిద్ధప్ప ద్వారా రైతు అధికారులకు మొరపెట్టుకున్నారు. కానీ ఎవరూ స్పందించలేదని రైతు విజయ్ ఆవేదన చెందారు. ఏరువాకకు వచ్చిన ఎద్దు చనిపోవడం అరిష్టమని రైతులు ఆందోళన చెందుతున్నారు.

LEAVE A REPLY