ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన టిడిపి

0
306

కర్నూలుః అధికార‌,ప్ర‌తిప‌క్ష పార్టీలు పోటీ ప‌డి ప్ర‌చారం నిర్వ‌హించిన‌,నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్‌సిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై 27,466 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. సోమవారం నంద్యాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఎన్నికల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూర్తి అయింది. మొత్తం 19రౌండ్లలో 16వ రౌండ్ మినహా ఏ రౌండ్‌లోనూ వైసీపీ ఆధిక్యాన్ని చాటుకోలేదు. కాగా, అధికార, ప్రతిపక్ష పార్టీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు టీడీపీ గెలుపుతో పార్టీ శ్రేణులు నంద్యాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి. తమ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమని భావించిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఫలితాలు హెచ్చ‌రించిన‌ట్లు అయింది
1,68,468 =19/19: -టీడీపీ-97,176 -వైసీపీ-69,610 -కాంగ్రెస్-1,382

LEAVE A REPLY