ఉద్దానం ప్రాంతంలోని గ్రామాల్లో లక్ష మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం-మంత్రి కామినేని

0
433

సోంపేటలో డ‌యాల‌సిస్ యూనిట్ ప్రారంభం…
శ్రీకాకుళంః జిల్లాలో ఇప్పటి వరకూ ఐదు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామ‌ని,ఉద్దానం ప్రాంతంలోని గ్రామాల్లో లక్ష మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాఆరోగ్య‌శాఖ మంత్రి కామినేని.శ్రీనివాస్ చెప్పారు.ఆదివారం సోంపేట లో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన డయాలసిస్ కేంద్రాన్నిమంత్రి అచ్చెనాయుడుతో క‌ల‌సి ప్రారంభించిన సంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ వైద్య‌ప‌రిక్ష‌లు నిర్వ‌హించిన వారిలో దాదాపు 13 వేల మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించార‌న్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులను పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని,డయాలసిస్ కేంద్రాల్లో మూత్రపిండాల వైద్య నిపుణులుల మూడు షిప్ట్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నమ‌ని తెలిపారు.అవసరమైతే సిబ్బందిని పెంచుతమ‌ని,త్వరలోనే మూత్ర పిండాల వ్యాది బారిన పడిన వారికి ఇచ్చే పెన్షన్ మంజూరు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు.

LEAVE A REPLY