ఆసుప‌త్రి ఆవ‌ర‌ణం పరిశుభ్ర‌త వల్ల తొంద‌ర‌గా ఆరోగ్యం కుదుట‌ప‌డుతుంది-మంత్రి కామినేని

0
156

పశ్చిమ గోదావరిః ఆసుపత్రి అభివృద్ధిలో ఎంపీ,ఎమ్మెల్యే, ఆసుపత్రి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల బాగా అభివృద్ధి జరిగిందని,ఆసుపత్రిలో కొత్త శానిటేషన్ పాలసీ వల్ల పారిశుధ్యం మెరుగుపడిందని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ అన్నారు.గ‌రువారం ఎంపీ మాగంటి బాబు,ఎమ్మెల్యే బడేటి బుజ్జితో క‌లసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో “స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి ఆవరణలోని రోడ్లను శుభ్రం చేశారు.ఈసంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంపట్ల రోగుల‌కు భ‌రోసాతో పాటు,ఆరోగ్యం తొంద‌ర‌గా కుదుట‌ప‌డుతుంద‌న్నారు. ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఆసుపత్రి సూపరింటెండెంట్,సిబ్బందిని అయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు.ఈ కార్య‌క్ర‌మంలో స్దానిక నాయ‌కులు,అధికారులు పాల్గొన్నారు.
‍‍‍జోన్ డ్రగ్ ఇన్ స్పెక్టర్ కార్యాలయం ప్రారంభంః-
కృష్ణా జిల్లాః ఇబ్రహీంపట్నం ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో జగ్గయ్యపేట జోన్ డ్రగ్ ఇన్ స్పెక్టర్ కార్యాలయంను మంత్రులు డా.కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, డిజి డ్రగ్స్ రవిశంకర్ అయ్యర్‌లు ప్రారంభించారు.ఈసంద‌ర్బంలో అయ‌న మాట్లాడుతూ 13 జిల్లాలో సంచార ర‌క్త‌నిధి కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

LEAVE A REPLY