అన్నాడీఎంకే పార్టీ నుంచి చిన్నమ్మ శశికళను, దినకరన్‌ల‌ను గెంటివేత …?

0
249

చెన్నైః అన్నాడీఎంకే పార్టీ నుంచి చిన్నమ్మ శశికళను, దినకరన్‌ను తొలగించారు. ఇప్పటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ, డిప్యూటీ జనరల్ సెక్రటరిగా దినకరన్‌లు కొన‌సాగుతున్నారు.మంగ‌ళ‌వారం ఉదయం నుంచి జరుగుతున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమెపై చర్చించిన పార్టీ, తక్షణం అమల్లోకి వచ్చేలా దిన‌క‌రన్‌, శ‌శికళను బర్తరఫ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దివంగత నేత‌ జయలలిత స్వయంగా పదవుల్లో నియమించిన వారిని ప్రస్తుతానికి కొనసాగించాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది.రెండు ఆకుల గుర్తు తమకే చెందుతుందని మరో తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. ఆపై సర్వసభ్య సమావేశాన్ని ముగిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ సమావేశానికి పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా స్థాయి నేతలు, వివిధ పార్టీ పదవుల్లో కొన‌సాగుతున్న వారు హాజరయ్యారు.మరోవైపు, శశికళను, తనను తొలగించే హక్కు వారికి లేదని దినకరన్ అన్నారు. అవసరమైతే తాము ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మండిపడ్డారు.

LEAVE A REPLY