అంగ‌న్‌వాడీ సిబ్బందికి వేతనాలు పెంచిన ఘ‌న‌త తెలుగుదేశంకే ద‌క్కుతుంది-మృణ‌ళిని

0
266

విజ‌య‌న‌గరంః అంగన్‌వాడీ కేంద్రం ద్వారా స‌ర‌ఫ‌రా అవుతున్నా పోష‌కాహారం పంపిణీలో ఎలాంటి లోపాలుత‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నిమంత్రి కిమిడి.మృణ‌ళిని అధికారుల‌ను ఆదేశించారు.గురువారం విజ‌య‌న‌గం జిల్లాలోని పార్వ‌తి పురంలోని క్రిష్ణ‌ప‌ల్లిలోని అంగ‌న్‌వాడీ కేంద్రం,ప్రాథ‌మిక ఆరోగ్య ఉప‌కేంద్రం నూత‌న భ‌వ‌నాన్నిప్రారంభించారు.అంత‌కు ముందు అమె ఎన్‌.టి.ఆర్ విగ్ర‌హానికి పూల‌మాల‌వేసి జెండా అవిష్క‌రించారు.ఈస‌ద‌ర్భంలో మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఎన్నిక‌ల హామీలో భాగంగా అంగ‌న్‌వాడీ సిబ్బందికి వేత‌నాలు పెంచిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకే ద‌క్కింద‌న్నారు.అలాగే ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రంలో అన్ని వేళ‌లా ఎఎన్ఎంలు అందుబాటులోఉండాల‌న్నారు.ప్రాథ‌మిక ఆరోగ్య‌కేంద్రాని ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకొవాల‌ని కోరారు.

LEAVE A REPLY