AP&TGCRIME

సైబరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న12 మందిని అరెస్ట్ చేసిన స్పెషల్ ఆపరేషన్ టీమ్

హైదరాబాద్: డ్రగ్స్ వాడుతున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించడంలేదని విమర్శలకు ఉతం ఇస్తూన్న సంఘటన సైబరాబాద్‌లో చోటు చేసుకుంది.. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో SM లగ్జరి గెస్ట్ రూమ్,, కో లివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై స్పెషల్ ఆపరేషన్ టీమ్(SOT) పోలీసులు దాడి చేశారు..డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని అరెస్ట్ చేశారు.. హైదరాబాద్ యువకులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్‌తో పాటు డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు..డ్రగ్స్ పార్టీలో MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు..ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్స్‌ తో పాటు 6 మందిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసకున్నారు..

సాజీర్,, వెన్నెల రవి కిరణ్,, కార్ల పొడి వెస్లీ సుజిత్,,మన్నే ప్రశాంత్,, గుత్తా తేజ కృష్ణ,,పి హర్షవర్ధన్ రెడ్డి,, పకనాటి లోకేష్ రెడ్డి,, గుండబోయిన నాగార్జున,,పృథ్వి విష్ణువర్ధన్,,మేకల గౌతం,,సతీష్ రెడ్డిలను ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.. నిందితులలో సాప్ట్ వేర్ ఉద్యోగులు,,ఆర్కిటెక్టులు,,డ్రైవర్లు,,డీజే ప్లేయర్లు,, ఫొటోగ్రాఫర్లు ఉన్నారు..పట్టుబడిన వారి నుంచి 6 లక్షల 51 వేల విలువ చేసే MDMA డ్రగ్ 31.2 గ్రాములు,,3 గ్రాముల గంజాయితో పాటు మొబైల్ ఫోన్లు,,2 బైకులు,,కంప్యూటర్ డాంగిల్స్,,జీపీఎస్ కార్డు రీడర్ స్వాధీనం చేసుకున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *