స్టెల్త్ టెక్నాలజీతో 5TH జనరేషన్ విమాన తయారీ ప్రాజెక్ట్ ను అమోదించిన రక్షణ మంత్రి
అమరావతి: రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ కు పెద్ద ప్రోత్సాహకంగా, దేశీయంగా అధునాతన 5TH జనరేషన్ యుద్ధ విమానం అభివృద్ధికి రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ ఆమోదించారని రక్షణ మంత్రిత్వశాఖ అధికారి తెలిపారు.. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMCA ప్రోగ్రామ్ కోసం ఎగ్జిక్యూషన్ మోడల్ ను ఆమోదించారని,, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA) భారతీయ పరిశ్రమ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుకు చేపట్టడడం జరుగుతుందని వెల్లడించారు..ఈ ప్రాజెక్టు ద్వారా భారత వాయుసేన సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతో సహా దేశీయ రక్షణ పరిశ్రమను దృఢంగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు..పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చేపట్టనున్నదని పేర్కొన్నారు..ఈ ప్రాజెక్టు ప్రారంభ అభివృద్ధి వ్యయం దాదాపు రూ.15 వేల కోట్లుగా అంచనా వేశారు.. ఈ యుద్ధ విమానం స్టెల్త్ టెక్నాలజీతో శత్రుదేశాల్లోకి లోతుగా చొచ్చుకుపోయే సామర్థ్యం కలిగి ఉంటుంది..గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది..
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ:- దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ నమూనాను తొలిసారిగా ‘ఏరో ఇండియా-2025’ కార్యక్రమంలో భారత్ ప్రపంచానికి చూపించింది.. ఆర్టీఫియల్ ఇంటెల్ జెన్సీ (AI) ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానంలో వుంటాయి..ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా సత్తా చాటుతుంది..25 టన్నుల బరువు ఉండే ఈ విమానం “మానవ సహితంగా, మానవ రహితంగా పనిచేసేలా” రూపొందించనున్నారు.. ఏడీఏ దీని డిజైన్‌ను రూపొందించింది..హైదరాబాద్‌కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది.

